బిచ్కుంద ఏప్రిల్ 14 (జనంసాక్షి)మండలకేంద్రంతో పాటు గోపన్పల్లి, హజ్గుల్, దేవాడ, పుల్కల్, దౌల్తాపూర్, కందర్పల్లి, మాన్యాపూర్, దడ్గి తదితర గ్రామాల్లో పలు చోట్ల సర్పంచులు పలు చోట్ల ఎంపీటీసీలు బాబా సాహెబ్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంతక ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పారటం చేసిన మహానియుడని కొనియాడారు. యువత బాబాసాహెబ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపన్పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి, హజ్గుల్, దేవాడ సర్పంచులు ఎంపీటీసీ బండకింది సాయిలు, జయశీల యాదవ్ కందర్పల్లి పండరి మరియు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




