Thursday, 5 November 2026

గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన

బెల్లంపల్లి, మార్చ్ 13, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని పెద్దనపల్లి గ్రామం 10, 11 వార్డులో సోమవారం గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్టింపజేశారు. భూలక్ష్మి, మహా లక్ష్మి, పోచమ్మ, బొడ్రాయి, మైసమ్మ అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా చేయడం గ్రామస్తుల అదృష్టం అన్నారు. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ అమ్మవార్ల బొడ్రాయి ప్రతిష్టా పోచమ్మ దేవతల కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుబిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, స్థానిక కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్, బీఆరెస్ నాయకుడు శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్ల్, బిఆర్ఎస్ నాయకులు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.