Thursday, 5 November 2026

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

బెల్లంపల్లి, మార్చ్ 13, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు నిజామాబాదు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, ఇతర కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్, బీఆరెస్వై, బీఆరెస్వి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.