Tuesday, 3 November 2026

గ్రామ దేవత బొడ్రాయి మరియు ముత్యాలమ్మ గుడి

గ్రామ దేవత బొడ్రాయి మరియు ముత్యాలమ్మ గుడి పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

 

కొడకండ్ల, డిసెంబర్ 04 ( జనంసాక్షి ) బొడ్రాయి బాగుంటే ఊరంతా బాగుంటారు. అందుకే నేను బొడ్రాయిబాగు చేసుకోండి ఊళ్ళోఅక్కడక్కడ ఉన్న అసమ్మతులు బాగవుతాయని చెప్తుంటానని ఈరోజు రేగుల ఈ గ్రామ దేవత, బొడ్రాయి మరియు ముత్యాలమ్మ గుడి పునః ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషమని ఇందులో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేస్తామని రమ్మని పిలవడం నేను అదృష్టంగా భావించాస్తున్నాను.అనంతరం మాట్లాడుతూఊరు బాగు పడాలని,అందరూ సంతోషంగా ఉండాలిని మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చానని,రేగుల నుంచి కాలువ పోయేటట్లు చేస్తాను.
ఊరిలో ఒకరిద్దరు అట్లా, ఇట్లా ఉన్నారనే బొడ్రాయి మంచిగా వేయమన్నాను.
రేగుల గ్రామంను అందంగా తయారు చేస్తాను అని అన్నారు.అలాగే
ముత్యాలమ్మ గుడికి ఎంత ఖర్చు అయినా నేనే ఇస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
ఈ శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పేరు, పేరున ధన్యవాదాలు తేలిపారు.
ఈ కార్యక్రమంలో
డీసీసీబీ వైస్ చైర్మన్ కుందురు వెంకటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, రాష్ట్ర ఈ జి ఎఎస్ కౌన్సిల్ సభ్యులు అందే యాకయ్య, స్థానిక సర్పంచ్ కల్సాని వెంకటరెడ్డి, ఎంపీటీసీ దోపతి లక్ష్మి- సోమారెడ్డి, దేవస్థానం డైరెక్టర్ ఉప్పల్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బాకి ప్రేమకుమార్, గ్రామపార్టీ అధ్యక్షుడు కమ్మగాని రాములు, మండల యూత్ అధ్యక్షుడు సతిష్ గౌడ్, ఉప్పసర్పoచ్ ఎల్లమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు