గ్రామ పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వం :కే వి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు

శామీర్ పేట్, జనంసాక్షి : పంచాయతీ కార్మికులతో రోజంతా వెట్టి చాకిరీ చేయించుకొని సమాన వేతనం ఇవ్వలేని ప్రభుత్వానికి పుట్ట గతులుండవని కే వి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు అన్నారు. బుధవారం శామీర్ పేట్ మండల కార్యాలయం ముందు అంబేద్కర్ వద్ద అర్ద నగ్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కెవి పి ఎస్ జిల్లా కార్యదర్శి బాల పీరు, సి టి టి యు రాష్ట్ర పంచాయతీ కార్మికుల అధ్యక్షులు శ్రీనివాస్,ఐ ఎఫ్ టి యు రాష్ట్ర పంచాయతీ కార్మికుల ప్రధాన కార్యదర్శి శివబాబు,పంచాయతీ వర్కర్స్ నాయకులు సుధాకర్, ముత్యాలు, పోచయ్య, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు