హెల్త్ సబ్ సెంటర్ లలో కానరాని ఏ ఎన్ ఎం లు కరువైన పర్యవేక్షణ. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. యథేచ్ఛగా విధులకు గైర్హాజరు

 

బీమిని, జులై 12, (జనంసాక్షి):  భీమిని మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృక్పధం తో సబ్ సెంటర్ లను ఏర్పాటు చేసింది . ప్రతి సబ్ సెంటర్ లో ఇద్దరు ఏ ఎన్ ఎం లు ఉండేలా ఏర్పాటు చేసింది . ఇక్కడివరకు కథ బాగానే ఉంది ఇదే అదునుగా భావించిన ఏ ఎం ఎం లు ఎవరు చూస్తారులే ఎవరు రారు లే మనం ఆడింది ఆట పాడింది పాట అన్న అలసత్వం తో యథేచ్ఛగా విధులను విస్మరిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వైనం మండలం లోని సబ్ సెంటర్ లో కనిపిస్తోంది వీగామ లో విధులు సరిగా నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు సరైన పర్యవేక్షణ లేకపోవడం తో ఏ ఎన్ ఎం లు ఇస్టరీతిన్ వ్యవహరిస్తున్నారు అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి వర్షా కాలంలో ప్రబలే వ్యాధుల పై అందుబాటులో ఉండాల్సిన ఏ ఎన్ ఎం లు ఉండటం లేదనే వాదన బలంగా విపిస్తోంది విధులకు గైర్ హాజరు అవుతున్న ఎ ఎన్ ఎం ల పై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భీమిని వైద్యుడు కృష కు సమాచారం అందించగా అలాంటిది ఏమి లేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. జిల్లా వైద్యాధికారిని ఈ విషయం పై వివరణ కోసం ఫోనులో సంప్రటించగా అందుబాటులో కి రాలేదు సబ్ సెంటర్ ల పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రజలకు వైద్యం అందని ద్రాక్షే.

తాజావార్తలు