వీర్నపల్లి, జూలై 06 (జనంసాక్షి): వీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నుండి మండల వ్యాప్తంగా కార్మికులు నిరవధిక సమ్మె బాట పట్టారు. గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక అంబెడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి సమ్మె శిభిరానికి ర్యాలీగా వచ్చి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ నిరవధిక సమ్మెను స్థానిక ఎంపిటిసి మల్లారపు అరుణ్ కుమార్ గ్రామ పంచాయతీ కార్మికులకు సంపూర్ణ మద్దత్తు తెలియజేశారు సమ్మెను ఉద్దేశించి ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రము స్వచ్భారత్ లో ముందు ఉందని చెప్పే పాలకులు కార్మికుల గురించి పట్టించుకొనే నాథుడే కరువాయ్యడని హెద్దెవా చేశారు. కరోనా కాలంలో ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రాణలకు తెగ్గించి సేవలు చేసిన, కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయన్నారు. చీపురు పట్టుకొని స్వచ్ భారత్ ఫోటో లు దిగే మోడీకి కార్మికుల బాధలు కనబడటం లేదా అన్నారు. మరో వైపు కేసీఆర్, కేటీఆర్ కార్మికులను పట్టించు కోవడం లేదని కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10లక్షల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలుగా నియమించాలని అన్నారు. జాతీయ అర్జీత సెలవు దినాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కోనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు నర్సయ్య, కార్యదర్శి శేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షలు జలపల్లి మనోజ్, నాయకులు సురేష్, కమల్, శ్రీను, నగేష్, రమేష్, యాదగిరి, హరీష్, నర్సవ్వ, భూమవ్వ లక్మి, తదితరులు పాల్గొన్నారు.




