వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 19 (జనం సాక్షి)గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రధాన్యత ఇవ్వాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం మీతో నేను”కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల కేంద్రంలో* ఉదయం .గ్రామంలోని ఇళ్ల మధ్యలో పెంట కుప్పలు, పిచ్చిమొక్కలు మరియు పాడు బడ్డ ఇళ్ళు ఉండటంతో పల్లె ప్రగతిలో ఏం చేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ, ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలన్నారు.ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పని చేస్తూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చి, సరిపడా నీటిని అందించాలని, ఎక్కడ కూడా మిషన్ భగీరథ పైపు లీకేజీలు లేకుండా, వెంట వెంటనే పైపు లీకేజీలను సరిచేస్తూ… మంచి నీటిని సరఫరా చేయాలన్నారు. సురక్షితమైన మిషన్ భగీరథ మంచినీటిని ప్రజలందరూ త్రాగాలని, అందుకు అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.ధారూర్ గ్రామంలో థర్డ్ వైర్ మరియు ఫిఫ్త్ వైర్ ఏర్పాటు చేయాలని, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేయాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకం ద్వారా ధారూర్ మండల కేంద్రానికి చెందిన రైతులకు ఇప్పటివరకు 10 కోట్ల పైచిలుకు రావడం జరిగిందన్నారు.గ్రామంలో ఇప్పటివరకు మరణించిన 16 మంది రైతుల యెక్క కుటుంబాలకు రైతుబంధు పథకం ద్వారా*80 లక్షలురావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్ గుప్త గ్రామ సర్పంచ్ చంద్రమౌళి ఎంపీడీవో చంద్రశేఖర్ తాసిల్దార్ భువనేశ్వర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ మాజీ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





