భువనగిరి టౌన్ (జనం సాక్షి-)::–భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామనికి చెందిన ముస్లింలకు తాజ్పూర్ బీఅర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మత విద్వేశాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసిమెలసి ఉంటున్నారన్నారు. సర్వమత సామరస్యాన్ని తెలంగాణ తెలంగాణ చాటిందని, సీఎం కేసీఆర్ అందరినీ, అన్ని మతాలను సమానంగా చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తరచూ చెప్పే, తెలంగాణకే తల మానికమైన ‘గంగజమునా తెహజీబ్’ మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే ప్రజల పండుగలు నిర్వహించే గొప్ప సంస్కృతిని కేసీఆర్ ప్రారంభించారని కొనియాడారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రతి ఏటా రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ముస్లింలకు దుస్తులను, రంజాన్ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ కింద ఆర్థిక సాయం అందిస్తుందని గుర్తు చేశారు. ఇఫ్తార్ విందులో భువనగిరి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగం పాండు, జర్నల్ సెక్రటరీ నీల ఓంప్రకాష్ గౌడ్,గ్రామ సర్పంచ్ బొమ్మరపు సురేష్, ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు సామల వెంకటేష్ , అనంతరం సర్పంచ్ చిందం మల్లికార్జున్, మాజీ ఎంపీపీ కేశవ్ పట్నం రమేష్, మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




