Wednesday, 4 November 2026

సిద్దిపేట మాదిరిగా సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించాలి జి ఎం పి ఎస్

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 17::– ప్రభుత్వ భూములలో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించి ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకం సహకార యూనియన్ భూదాన్ పోచంపల్లి గ్రామ సభ్యులు కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరాఛారికి పలు డిమాండ్లతో కూడిన కోరికల పత్రాన్ని కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరాఛారికి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.పోచంపల్లి గ్రామ రెవిన్యూ శివారు సర్వే నెంబర్ 620లోని గొర్రెల షెడ్లు నిర్మించుకొనుటకు ఎ.1-20 గుంటల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించడం వల్ల వీధి కుక్కలు మరియు దొంగల నుండి మూగజీవాలకు రక్షణ పెరుగుతుందన్నారు.మూగజీవాల తాగునీటి కోసం గొర్రెల మందల వద్ద బోరు బావులు తవ్వించి నీటి తొట్లు నిర్మించాలని,కరెంటు సౌకర్యం కల్పించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల బుచ్చయ్య, చంద్రయ్య,జెట్ట లింగస్వామి, గడ్డమీది రాములు,మచ్చ ప్రభాకర్,  కౌడె రమేష్,బాతుక  లింగయ్య, కొమురయ్య,ఐలయ్య,నెట్టు నరేందర్ పాల్గొన్నారు.