Wednesday, 4 November 2026

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 

జహీరాబాద్ మార్చి 8( జనం సాక్షి )పట్టణం లోని పస్తాపుర్ లోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు అందరు కలసి కేక్ కట్టింగ్ చేసి ఒకరికి ఒకరు శుభాకాక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సింగర్ సంధ్య పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు బానిసలు కాదు మహిళలు అది శేక్తి అన్నారు అడది లేనిదే సృష్టి లేదు .మహిళ దినోత్సవం రోజు నా మాత్రమే గౌరవించకుండ ప్రతి రోజూ గౌరవించాలి . అప్పుడే మహిళకు గౌరవం దక్కినట్టు అని అన్నారు. మరొక్క సారి నాతో ఉన్నా నా సమాజం లో ఉన్న అక్క చెల్లెలకి మరొక్క సారి మహిళ దినోత్సవా శుభాకాక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడు రాయికోటి నర్సింహులు, ఉపాధ్యక్షురాలు వసిమా తదితరులు పాల్గొన్నారు.