హుజూర్ నగర్ మార్చి 8 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన నవ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జ్ బివిఎన్ పద్మరాజు తండ్రి సిపిఎం నాయకులు బొల్లేపల్లి పెద్ద వెంకటరాజు దశదినకర్మలో నవ తెలంగాణ రాష్ట్ర నాయకులు, సిబ్బంది బుధవారం పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొల్లేపల్లి పెద్ద వెంకటరాజు మృతి బాధాకరం. ఆయన సిపిఎం పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ రాష్ట్ర స్థాయి సిబ్బంది అజయ్, మధుకర్, శశికళ, లలిత, జిల్లా ఇన్చార్జి పి.మట్టయ్య, సిపిఎం మండల నాయకులు పోతనబోయిన హుస్సేన్, పల్లె వెంకటరెడ్డి, నాగారపు పాండు, దుగ్గి బ్రహ్మ, వెంకట చంద్ర, గోపరాజు, పారేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బొల్లేపల్లి పెద్ద వెంకటరాజు దశదినకర్మలో పాల్గొన్న నవ తెలంగాణ రాష్ట్ర నాయకులు




