Thursday, 5 November 2026

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

 

 

గుడిహత్నూర్: ఏప్రిల్, 14( జనం సాక్షి)బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను  బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భీమ్ టైగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు మస్కే మాధవ్ మాట్లాడుతూ నిమ్న వర్గాల ఆరాధ్య  దైవం అంటరానితనాన్ని రూపుమాపుటకు ఆలు పెరుగును కృషి చేసిన యోధుడు సామాజిక రాజకీయ న్యాయాన్ని సమానంగా అందించిన మహా నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ అన్ని వర్గాల పీడిత ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ దేశానికే గర్వకారణం అన్నారు. అంబేద్కర్ మార్గ నిర్దేశాలను యువత ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటంతో ప్రధాన విధులగుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పతంగే బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, పిఎస్ సి ఎస్ చైర్మన్ సంజు ముండే, ఉప సర్పంచ్ మటపతి గజానంద్, రమేష్ జాదవ్, సిద్ధార్థ ససానే, గోవింద్ బుద్ధే, కిషన్ బుద్ధే, మాధవ్ ససానే, వామన్ గితే,సల