ధర్మపురి 14 (జనం సాక్షి) తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటు చేసినటువంటి 24 గంటల కరెంటును రైతులకు అందిస్తున్నారు. అందుకు విరుద్ధంగా ధర్మపురి మండలంలోని రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల శివారులో మరియు వెలగటూర్ మండలంలోని ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారం లోని కాపర్ వైర్ ను, గత కొంతకాలంగా ఎవరికి దొరకకుండా, ఎవరికీ చిక్కకుండా, కాపర్ వైరును దొంగతనం చేసిన నిందితులను చాకచౌక్యంగా ధర్మపురి సిఐ ఆధ్వర్యంలో ఎస్సై కిరణ్ కుమార్ పర్యవేక్షణలో మరియు వెలగటూరు ఎస్సై రెండు టీములుగా వేరువేరుగా ఏర్పడి నిందితులను అన్ని ఆధారాలతో వివిధ ప్రాంతాలలో నిందితుల ఆచూకీ కోసం గాలిస్తుండగా ఉదయం శుక్రవారం తొమ్మిది గంటల సమయంలో ధర్మపురి అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, నిందితులు ఇద్దరు అనుమానస్పదము గా రోడ్డు మీద వెళుతుండగా వారిని పట్టుకొని చూడగా సంచిలో కాపర్ వైర్ ఉన్నట్లు వారి గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సీఐ మీడియాకు సమాచారం అందించి వారు మాట్లాడుతూ, మధ్యాహ్నం సమయంలో ప్లాస్టిక్ డబ్బాలకు మరియు పాత సామాన్లు కొనుటకు మధ్యాహ్న సమయంలో వెళ్తూ, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారం లను మధ్యాహ్న సమయంలో వాటిని గుర్తించి, రాత్రి సమయంలో దొంగల బ్యాచ్ గుమ్మ గుడి దొంగతనానికి స్కెచ్ వేశామని, నిందితులు తెలిపారని వారు మీడియా తెలిపారు. ఈ నిండుతులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది. ఎ స్ఐ రాజు, సలీం, అశోక్, శంకర్, శేఖర్, రమేష్, మల్లేశం, వెంకటేష్, నవీన్ కుమార్, ముస్తఫా, ఆదిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




