ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
పదర జనం సాక్షి: మండల కేంద్రంలో మంగళవారం నాడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నల్ల పోతుల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత బీహార్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంబేద్కర్ దేశం సుస్థిరంగా ఉందని సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని వారు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను యువకులు ఆచరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు జగపతి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామలింగయ్య యాదవ్, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బాలింగయ్య, సంఘ నేతలు రాజు, వెంకటేష్, తిమోతి, టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు శరత్ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు ఖాజా, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు




