Thursday, 5 November 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
*నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 06, జనంసాక్షి:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ పార్కులో గల ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని అన్నారు . భారత రాజ్యాంగ శిల్పి, సంఘ సంస్కర్త మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, లింగంపల్లి సంజీవ్ టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.