Wednesday, 4 November 2026

ఘనంగా ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 9, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యూఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 53 సంవత్సరాలుగా ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఎన్ఎస్యూఐ పోరాడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముఖ్య పాత్ర పోషిస్తుందనీ, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు మొగ్గు చూపుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందనీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకొనితెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి విద్యను అందేలా చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజిక వర్గ ఇంచార్జి చిలుముల శంకర్, బెల్లంపల్లి ప్లోర్ లీడర్ బండి ప్రభాకర్, కౌన్సిలర్ గుజ్జ రవి, పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్, మాజీ నియోజికవర్గ అధ్యక్షులు ఎనగందుల వెంకటేష్, నాతరి స్వామి, కన్నేపల్లి మండల అధ్యక్షుడు రోహిత్, కంపెళ్ళి పవన్, ఎన్ఎస్యూఐ బెల్లంపల్లి మండల అధ్యక్షుడు ముద్దం శివప్రసాద్, తాండూర్ మండల అధ్యక్షులు కొయ్యల రవి కుమార్, ఉపాధ్యక్షులు చిలుముల సాయి కుమార్, రఘు, నాయకులు సాయికిరణ్, అభి, సాగర్, పవన్, రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.