Wednesday, 4 November 2026

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంఎమ్మెల్యే షిండే

 

 

 

 

 

బిచ్కుంద జుక్కల్ ఏప్రిల్ 09 (జనంసాక్షి) కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆదివారం నాడు జుక్కల్ మండలకేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదగబోతోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఇది తట్టుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కార్యకర్తలే పార్టీకి పటుగొమ్మలన్నారు. పార్టీ కన్నతల్లిలాంటిదని, కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా  తాను అండగా ఉంటానన్నారు. గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించే బాధ్యత నాయకులది, కార్యకర్తలదేన్నారు. ఈ కార్యక్రమంలో యశోద నీలు పటేల్, మాధవరావు దేశాయ్, సాయాగౌడ్, రాజు పటేల్, రాములు, శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.