ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జహీరాబాద్ డిసెంబర్ 28( జనం సాక్షి) జహీరాబాద్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కండేం నర్సిములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన. మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటు పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,రానున్న కాలంలో దేశంలో సోనియా గాంధీ అధ్వర్యంలో మరియు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అధికారంలోకి కచ్చితంగా వస్తుందని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే, త్యాగాల పార్టీ దేశభద్రతలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి భద్రతే ముఖ్యంగా పాలన సాగించింది ఇప్పుడున్న పార్టీలు కులమతల మీద రాజకీయాలు చేస్తున్నాయి దేశంలో పేద ప్రజల గురించి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ రాచప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షద్ అలీ, మాజీ ఎంపిటిసి లు కౌంస్లర్ లు తహెరా బేగం, నాగిశెట్టి, మల్లారెడ్డి, కోఆప్షన్ సభ్యులు , మైనోద్దీన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్, మైనార్టీ సెల్ నాయకులు మొహ్మద్ జెమిలోద్దీన్, అక్బర్ హుస్సేన్, శుభాస్ రెడ్డి, ఇమాం పటేల్, నసూరుల్లా ఖాన్, నాయిమ్ అహ్మద్, చిన్న, యువజన కాంగ్రెస్ నాయకులు మొహ్మద్ జాఫర్ మొహ్మద్ అక్తర్, వజహత్,రాజు నాయక్ జెహీర్ బాబ్ల్యూ, నారాయణరెడ్డి, భిమాశంకర్, చేసుమోద్దీన్, కేశవరెడ్డి,సంతోష్ రెడ్డి, సంజీవ, నగేష్, పలువురు సర్పంచ్ లు, యువజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




