ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వీణవంక డిసెంబర్ 28 జనం సాక్షి వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైనారు.ఎండీ సాహెబ్ హుస్సేన్, భగవాన్ రెడ్డిలు కలిసి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటు పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,రానున్న కాలంలో దేశంలో సోనియా గాంధీ అధ్వర్యంలో మరియు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అధికారంలోకి కచ్చితంగా వస్తుందని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీనే, త్యాగాల పార్టీ దేశభద్రతలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి భద్రతే ముఖ్యంగా పాలన సాగించింది ఇప్పుడున్న పార్టీలు కులమతల మీద రాజకీయాలు చేస్తున్నాయి దేశంలో పేద ప్రజల గురించి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజి రెడ్డి, వడ్డేపల్లి కొమురయ్య, చదువు జైపాల్ రెడ్డి, జన్నుతుల మధుకర్ రెడ్డి, నల్లగోని వీరయ్య, పల్లె అంజిరెడ్డి, నిమ్మల సమ్మయ్య, మందల అనిల్ రెడ్డి, చింతల హరీష్ రెడ్డి, ఎండి సలీం, ఎండీ రజాక్, అజయ్ దితరులు పాల్గొన్నారు




