శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15
బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షిరామ్ జయంతి వేడుకలను శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిఎస్పి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. కాన్షిరాం పూర్తితో యువతి యువకులు ముందుకు సాగి ఆయన కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ అహర్నిశలు బహుజనుల కోసం పోరాడుతున్నాడు ఆయనకు యువతి యువకులు అండగా నిలువాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు దేవునూరి భాస్కర్, మొలంగూర్ సెక్టార్ అధ్యక్షులు యం.డి మహమూద్ అలీ, నాయకులు తుమ్మ రఘుపతి, కాశీ భార్గవ్, వెంకటేష్, మొలంగూర్ బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శులు కొరపల్లి శివప్రసాద్, గాజుల శ్యామ్, నాయకులు దశరపు పవన్, మొలగురి రమేష్, శివ స్వామి, సందీప్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాన్షిరామ్ జయంతి వేడుకలు.




