Sunday, 8 November 2026

ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు
రేగోడ్ //జనం సాక్షి //డిసెంబర్:
క్రిస్టమస్ పండగ వేడుకలు ఆదివారం ఘనంగా కొనసాగాయి ఈ సందర్భంగా చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నాలుగు గంటల నుండి చర్చిల వద్ద పండుగ సందడి నెలకొంది మండల కేంద్రమైన రేగోడుతో పాటు మండలంలోని కొండాపూర్, తిమ్మాపూర్, ప్యారారం,తాటిపల్లి, కొత్వాన్ పల్లి, సిందోల్ తో పాటు, మండలంలోని అన్ని గ్రామాలలో పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.కాగా క్రైస్తవ సోదరులు,సోదరీమణులు, చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ఏసుప్రభు(క్రీస్తు) చెప్పిన సువార్త వాక్యాలను వివరించారు. ఈ సందర్భంగా కేకులను కట్ చేసి స్వీట్లను పంచి పెట్టుకున్నారు. కాగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆనందోత్సవాల నడుమ ఈ పండుగ కొనసాగింది.