Sunday, 8 November 2026

ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి డిసిసి ప్రధాన కార్యదర్శి ముదిరాజ్

ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి డిసిసి ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ దోమ డిసెంబర్ 25(జనం సాక్షి)
క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నివాసం పరిగి వద్ద క్రిస్మస్ ఉత్సవాలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పాస్టర్లు ఏసుదాస్, మోజెస్,బుచ్చయ్య, క్రీస్తు దాస్, సురేష్, రవి, రవీంద్ర, దేవదాస్, జాన్సన్, మాణిక్యం, జీవన్ ప్రసాద్, సుమారు 25 మందిని పాస్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని దాని గురించి మీరందరూ ప్రార్థన చేసి ఆశీర్వదించాలని సందర్భంగా కోరారు క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరా రెడ్డి గారు, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, పరిగి మండలాధ్యక్షుడు పరశురాంరెడ్డి కౌన్సిలర్ మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు ఆనం ఆంజనేయులు, చిన్న నరసింహులు, అక్బర్ హుస్సేన్, ఆనంద్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఎర్రగడ్డ పల్లి జగన్, రామకృష్ణారెడ్డి ,ఎజాజ్, షాహిద్ మైపాల్, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.