Wednesday, 4 November 2026

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

 

 

 

 

 

 

 

ఊరుకొండ, జనవరి 26 (జనంసాక్షి):ఊరుకొండ మండల కేంద్రంతోపాటు
మండలంలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు, యువజన సంఘాల కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రములోని పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై లక్ష్మణ్ నాయక్, గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ రాజయ్య, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ బక్కరాధ జంగయ్య, మహిళ సమాఖ్య భవనం వద్ద మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు సుమతమ్మ, అంగన్వాడి కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్త అరుణమ్మ, నేతాజీ యువజన సంఘం వద్ద అధ్యక్షులు హరీష్, నేతాజీ చౌక్ వద్ద మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, శ్రీ వేంకట బాలరామయ్య పాఠశాల వద్ద పాఠశాల కరస్పాండెంట్ సామల బాలరాజు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు బాలయ్య, ఎమ్మార్సి భవనం వద్ద అఖిల్,
దండోరా ఆధ్వర్యంలో అధ్యక్షుడు నరేష్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ జాకిర్ అలీ, బస్టాండ్ ఆవరణలోని వివేకానందుడి విగ్రహం వద్ద ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుడుముల తిరుపతిరెడ్డి, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ కార్యలయం వద్ద వీరారెడ్డిలు జాతీయ జెండా ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, ఎంపిటిసిలు గోపాలగుప్త, లావణ్య అమరేశ్వర్ రెడ్డి, కో షన్ కలిమ్ పాషా, నాయకులు గిరి నాయక్, బచ్చలకూర రమేష్, కొమ్ము శీను రాచకొండ గోపి, గ్రామ పెద్దలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతితులు తదితరులు పాల్గొన్నారు.