.
– 60 వేల ఆస్తి నష్టం.ఊరుకొండ, జనవరి 26 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని రాచాల పల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద అర్త్ వైర్ తగిలి కాడేద్దు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతు జల్ల ముసలయ్య, పరిసర వ్యవసాయ పులుల రైతుల కథల ప్రకారం.. జల్ల ముసలయ్య వ్యవసాయ పొలంలో వ్యవసాయ పొలంలో మేత మేస్తూ ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ కు తగిలి విద్యుత్ షాక్ కు గురి కావడంతో 60 వేల విలువచేసే కాడెద్దు మృతి చెందిందని బాధిత రైతు రోదిస్తూ తెలిపారు. వ్యవసాయానికి ఎల్లవేళలా అండగా ఉండే కాడేద్దు మృతిచెందడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని.. ప్రభుత్వపరంగా తమన ఆదుకోవాలని బాధిత రైతు, పరిసర వ్యవసాయ కులాల రైతులు కోరారు.




