జనం సాక్షి కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ ఆకుల ఓదెలు జన్మదిన వేడుకలను దుదిల్ల శ్రీను బాబు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆకుల ఓదెలు తో శీను బాబు బర్త్డే కేక్ కట్ చేయించి తన చేతుల మీదుగా తినిపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు తో పాటు మండలంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




