ఝరాసంగం జూన్ 13 (జనం సాక్షి ) ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామ బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛంద సేవా కార్యకర్త అయిన చింతల గట్టు శివరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం బి జె ఆర్ అధ్యక్షులు రాయికోటి నర్సింలు అధ్వర్యం లో తన్న నివాసం లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బి జె ఆర్ కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, రాయికోటి నర్సింలు దంపతులు చింతలగట్టు శివరాజ్ దంపతులకు నూతన వస్త్రాలతో భాహుకరించి పూలమాల శాలువతో సన్మానించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో డాక్టర్ అలిగే జాన్ శ్రీకాంత్ ,పంచాయతీ సెక్రటరీ రాజు,,సివిల్ కాంట్రాక్టర్ గంగారాం నర్సింలు ,ఉపాధ్యాయుడు నగేష్ ,బ్యాంక్ మిత్ర సంజీవ్,కొల్లూరు వార్డు సభ్యులు ఎం విష్ణు, శ్రీనివాస్ మాణిక్యం,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చింతల గట్టు శివరాజ్ వివాహ వార్షికోత్సవం వేడుకలు




