బచ్చన్నపేట ఏప్రిల్ 5 (జనం సాక్షి):బచ్చన్నపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు కంతి సత్యనారాయణ అధ్యక్షత వహించగా వివిధ రాజకీయ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ. భారత మాజీ ఉప ప్రధానిగా, సమతా వాదిగా వ్యవసాయ శాఖ మంత్రి గా, కార్మిక శాఖ మంత్రిగా,రక్షణ శాఖ మంత్రిగా,రైల్వే శాఖ మంత్రి గా, 50 ఏండ్ల పార్లమెంటేరియన్ ఆయన చేసిన కృషిని కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని మహానీయుల స్ఫూర్తితో మహాజనులందరినీ ఏకం చేసి స్వతంత్ర రాజకీయ యుద్ధంతోనే బడుగుల భవితను మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగొని బాలకృష్ణ గౌడ్. అలవాల ఎల్లయ్య. విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఉపాధ్యక్షులు మల్యాల బాల నరసయ్య. ఎమ్మార్పీఎస్ నాయకులు పైసా రాజశేఖర్. అల్వాల నర్సింగరావు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాపిరెడ్డి. మహిళా నాయకురాలు బుర్ర బాలమణి. ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు గంగాల బోయిన ఉప్పలయ్య. వైశ్య సంఘం నాయకులు పిన్న రమేష్. మైనారిటీ నాయకులు మహమ్మద్ యూసుఫ్. మాల మహానాడు నాయకులు గోర్ల అబ్బయ్య. చిలుముల మహేష్. కమ్మడి ఎమ్మార్పీఎస్ నాయకులు తుర్కపల్లి శ్రీనివాస్. రాగిశెట్టి లక్ష్మణ్. అల్వాల అజయ్. వికలాంగుల సంఘం మండల అధ్యక్షులు కామెడీ సిద్ధారెడ్డి ఉన్నారు
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి MRPS జనగామ జిల్లా కన్వీనర్ పైస రాజశేఖర్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాజకీయ దురందరుడు, పరిపాలన దక్షకుడిగా ఈ దేశ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహోన్నతమైన వ్యక్తి భారత మాజీ ఉప ప్రధాని, సమతా వాది డా,, బాబూ జగ్జీవన్ రామ్ గారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ రచనలో హక్కులు చట్టరూపం దాల్చెలా పోరాటం చేసిన ఫైటర్ జగ్జీవన్ రామ్ గారని అన్నారు.
అతిధులుగా మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాల్యాల బాల నర్సయ్య,MSP జిల్లా నాయకులు అల్వాల నర్సింగరావు మాదిగ గారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రాం గారి ఆశయాలను కొనసాగిస్తామని, మహనీయుల స్పూర్తితో మహాజనులందరిని ఏకం చేసి స్వతంత్ర రాజకీయ యుద్ధంతోటే బడుగుల భవితను మారుస్తామని,
ఈకార్యక్రమంలో బచ్చన్నపేట గ్రామ ఎంపిటిసి లు నల్లగోని పుష్ప బాలకిషన్ గౌడ్,అల్వాల రాధ ఎల్లయ్య,CPM జిల్లా నాయకులు గొల్లపల్లి బాపురెడ్డి,మహిళ నాయకురాలు బుర్ర బాలమణి,ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు గంగారబోయిన ఉప్పలయ్యా,వైశ్య సంఘ నాయకులు పిన్న రమేష్ ,కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ గౌస్ ,msp నాయకులు అల్వాల రాజు మాదిగ,mrps నాయకులు అల్వాల అనిల్ కుమార్ మాదిగ,తుర్కపల్లి శ్రీనివాస్,రాగిశెట్టి లక్ష్మణ్,vhps నాయకులు కామిడి సిద్దారెడ్డి,అల్వాల అజయ్ తదితరులు పాల్గొన్నారు…..




