సదాశివపేట, ఏప్రిల్ 05, జనంసాక్షి : వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగులపల్లి శ్రీనివాస్, జయమ్మ కూతురు మల్లేశ్వరి(20) మంగళవారం నాడు కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. 21 నవంబర్ 2021 నాడు అదే గ్రామానికి చెందిన మధుతో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరు నెలల నుంచి అత్త, భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేదించడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధులు ఆరోపిస్తున్నారు. మల్లేశ్వరి ఆత్మహత్యకు కారణం అయిన భర్త మధు, అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.




