Monday, 2 November 2026

ఘనంగా టైలర్స్ డే వేడుకలు.ఘనంగా టైలర్స్ డే వేడుకలు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 28( జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని పట్టణ మేరు సంఘం, టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా నాయకులు గెల్లి రాజలింగు యాదవ్ మాట్లాడుతు  రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతో మేర కులస్తులు, దీనిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగో చరంగా మారిందన్నారు. దర్జీ వృత్తి స్థితిగతులపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి మరో మారు విన్నవించడం జరుగుతుందన్నారు. దర్జీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మేరు సంఘం అధ్యక్షుడు గట్ల శంకర్, ముప్పిడి రమేష్, లక్ష్య నారాయణ, బాంబే, స్టైల్ కింగ్ టైలర్ యజమానులు, మేర కులస్తులు ,కార్మికులు పాల్గొన్నారు