బెల్లంపల్లి, ఫిబ్రవరి 28, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో మంగళవారం పదవీవిరమణ పొందిన కార్మికులు తొగరి వెంకటి, దుర్గం రాజం, జంజిరాల మనోహర్ కన్వేయర్ ఆపరేటర్లను గని ఆవరణలోని వేదిక మీద ఘనంగా సన్మానించారు. ఈ ముగ్గురు కార్మికులు 35 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని సంస్థ కోసం కష్టపడ్డారని, వారి శేష జీవితం సాఫిగా సాగాలని అధికారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి రాజు, బీఎం ఇంచార్జి ముస్తఫా, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్లు సైదులు, రాంసాగర్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి పిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, గని ఉద్యోగులు పాల్గొన్నారు.
పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం.




