Wednesday, 4 November 2026

ఘనంగా తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత అక్క 20వ వర్ధంతి.

 

 

 

 

 

జనం సాక్షి న్యూస్ /తుర్కపల్లి మే 26యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో తన ఆటపాటలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి బోసిన తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బెల్లి లలితక్క వర్ధంతి, జయంతి లను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని టాంక్ బండ్ పైన లలితక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెల్లి లలితక్క కుమారుడు సూర్యప్రకాష్ , మల్కాపురం సర్పంచ్ మేకల బాలకృష్ణ ,ముక్క జాగృత్,వెంకట స్వామి ,గడ్డమిది యాదగిరి , నర్సింహులు,మరియు బెల్లి లలితక్క అభిమానులు పాల్గొన్నారు.