Tuesday, 3 November 2026

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవేడుకలు”

పెన్ పహాడ్, జూన్ 02 (జనంసాక్షి )
పెన్ పహాడ్, మండల కేంద్రం లో శుక్రవారం, తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ శేషగిరిరావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నెమ్మది బిక్షం, పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ , వ్యవసాయ శాఖ కార్యాలయంలో కృష్ణ సందీప్ , పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెన్న సీతారా 0రెడ్డి, సెర్పు కార్యాలయంలో సిసి చెన్నయ్య, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తూముల శ్వేత సురేష్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి, పశు వైద్యశాలలో డాక్టర్ శ్రీజ, ఎమ్మార్సీ భవన్లో ఎంఈఓ రవి, కేజీబీవీ హాస్టల్లో ఎస్ఓ ఆసియా జిబి న్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మైలారపు వెంకన్న, ప్రాథమిక పాఠశాలలో కీత వీరేందర్ ,పాటు వివిధ గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయంలో స్థానిక సంస్థలలో జాతీయ జెండాను ఆవిష్కరించి దశాబ్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఇన్చార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ పద్మ రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మట్టయ్య ,స్వప్న, నాయకులు వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి , కో అప్షన్ సభ్యులు షేక్ రఫీ, ఎంపీటీసీలు ఊరుకొండ జానకమ్మ రాధాకృష్ణ, వెంకటరెడ్డి, రేవతి పరంధాములు, నాయకులు తూములఇంద్రసేనారావు ,ఒగ్గు గోపి, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.