సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): గనులు , భూగర్భ శాఖ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గనులు మరియు భూగర్భ శాఖ ఏడీ బి.వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు సైదులు, సత్తయ్య, భవానీ, సంజీవ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు




