Tuesday, 3 November 2026

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం సాక్షి, చెన్నరావు పేటతెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలో బుధవారం ఘనంగా జరిగాయి 41 ఆవిర్భావ వేడుకను పురస్కరించుకొని మండల కేంద్రం చెన్నారావుపేటలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లాడి వీరారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అదుపు నరసింహారావులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటనారాయణ బీసీ సెల్ అధ్యక్షుడు ఎండి జానీమియా గ్రామ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు అడుప మహేష్ గుండెబోయిన బిక్షపతి కుక్కల సాంబయ్య తొగరు రాజాలు తదితరులు పాల్గొన్నారు.