కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 4 :—. వెట్టి చాకిరి విముక్తి కోసం విష్ణురు రామచంద్రారెడ్డి పెత్తందారితనాన్ని వ్యతిరేకించేందుకు దొడ్డి కొమరయ్య చేసిన సాహసం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలని కురుమ యువ చైతన్య సమితి కార్యదర్శి మంగ యాకయ్య అన్నారు దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణుర్ దేశ్ముఖ్ పై పోరాడిన విప్లవ వీరుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో కేంద్రీకృతమైన వేలాది ఎకరాల భూమిని వారి కబంధాల నుంచి విముక్తి కలిగించి పేదలకు పంచిన పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని ఆయన ఘన కీర్తిని కొనియాడారు నేటితరం దొడ్డి కొమురయ్య అనుసరించిన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మారోజు సోమాచారి కె వై సి ఎస్ జిల్లా నాయకులు జంగిడి శ్రీనివాస్ కురుమ బూడిద నరేందర్ అంబటి వెంకటేష్ సునీల్ మాయ కోటి శ్రీను మంగ భాస్కర్ రేగు మహేందర్ కురుమ సంఘం నేతలు ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి




