వీర్నపల్లి, జులై 04 (జనంసాక్షి): బూత్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన నిర్వహించ తలపెట్టిన మేరా బూత్-సబ్ సే మజ్ బూత్ కార్యక్రమం నేటితో ముగిసినట్టు వీర్నపల్లి మండల అధ్యక్షులు గునుకుల దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారతీయ జనత పార్టీ స్వల్పకాలిక విస్తారక్ పరమశివన్ , భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి మేరా బూత్-సబ్ సే మజ్ బూత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కూడ వాటిని ప్రజలకు చేరనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపుతూ రాష్ట్ర అభివృద్దిని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలలో కాలం చెల్లిందని రాష్ట్రంలో ప్రజలెవరు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ను వీడి భాజపాకు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు నరేష్, తిరుపతి, మండల మాజీ అధ్యక్షులు మల్లేశం, మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు తిరుపతి, జిల్లా ఎస్టీ మోర్చ ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి లక్పతి, సీనియర్ నాయకులు ఖాజిబాబు, వినోద్, మహేష్, రాజేందర్,రవి, రామక్రిష్ణ, భాస్కర్, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, లింబద్రి, శ్రీనివాస్, సుమన్, తిరుపతి, కళ్యాణ్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలో మేరా బూత్-సబ్ సే మజ్ బూత్ కార్యక్రమం




