Tuesday, 3 November 2026

ఘనంగా ధ్వజారోహణం

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు బుధవారం ఘనంగా ధ్వజారోహణం నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, యజ్ఞాచార్యులు హరిచరణ్ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి ధ్వజారోహణం తదుపరి యాగశాలలో అగ్ని ప్రతిష్ట మూలమంత్ర హోమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.భక్తులందరికీ తీర్థ ప్రసాదములు, అన్న ప్రసాదం అందజేశారు.సంతానం లేని దంపతులకు గరుడ ముద్ద ప్రసాదం అందజేశారు.సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం, నిర్వహించి ఆలయ బలిహరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వై.శ్రీనివాసరెడ్డి, వికాస తరంగిణి అధ్యక్షులు టిఎస్వీ సత్యనారాయణ, బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్, మంజుల, సుభాషిని, జ్యోతి, జ్ఞాన కుమారి, సరోజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.