అనంత కష్టాలను అధిగమిస్తూ మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, రెండు ప్రతిష్టాత్మాక వృత్తి సంబంధ సర్టిఫికెట్లు మరియు డాక్టరేట్ సాధించి, తన ప్రతిభా పాటవాలతో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గా ఎంపికై బెంగుళూరులో భువనేశ్వర్ లో పనిచేస్తున్నడాక్టర్. ఇనుముల సత్యనారాయణ ఇటీవల డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ గా పదోన్నతి పొందారు. అతని తండ్రి సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా పనిచేయడం గమనర్హం.
పెద్దపల్లి జిల్లాకు మంథని గ్రామానికి చెందిన తెలంగాణ విద్యారత్నం
డాక్టర్ సత్యనారాయణ తొలుత సింగరేణిలో భూగర్భ గనుల్లో తర్వాత కార్పొరేట్ ప్లానింగ్ విభాగంలో పనిచేసి విశేష సేవలు అందించారు. అనంతరం జాతీయ స్థాయిలో గనుల రక్షణను పర్యవేక్షించే డైరెక్టేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఉద్యోగానికి యూపీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలో పాల్గొని జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆయన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీగా పదోన్నతి సాధించారు. ఆయన డి.ఎం.ఎస్.గా పదోన్నతి పొందడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.
సింగరేణి కార్మికుని కుమారుడైన సత్యనారాయణ పాలిటెక్నిక్, ఈ సెట్లో, మైనింగ్ ఇంజనీరింగ్ లో కూడా రాష్ట్ర మొదటి ర్యాంక్, 2002లో జరిగిన గేట్ పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఖరగ్‌పూర్‌లో ఐ.ఐ.టీ.లో సీటు సాధించారు.
ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.సీ.ఏ., గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎం.బీ.ఏ., ధన్‌బాద్ ఐ.ఐ.టీ. నుండి ‘ఓసి గనుల ఓబీ డంపుల స్థిరీకరణ’ అనే అంశంపై పి.హెచ్.డి. చేశారు. విద్యాధికునిగా, మైనింగ్ మేధావిగా పేరున్న డాక్టర్ ఐ.సత్యనారాయణ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గా ఎంపికైన మొట్టమొదటి అతిపిన్న వయస్కునిగా కూడా కొత్త రికార్డు నెలకొల్పారు. మరియు పేరు ప్రజ్ఞాతలు సంపాదించారు.
సింగరేణి సంస్థలో మైనింగ్ ఇంజనీర్లుగా పనిచేసి డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న మరో ఎనిమిది మంది కూడా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ గా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. వీరిలో కె.రవీందర్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, పి.రఘునాథ్, టామ్ మ్యాథీవ్స్, నయన్ సిన్హా, ఎన్.సంజీవ్ కుమార్, కె.మాధవరావు, జి.సంజయ్‌కుమార్ ఉన్నారు. వీరికి తోటి సింగరేణి అధికారులు, అధికారులు సంఘం నాయకులు అభినందనలు తెలిపారు..




