Thursday, 5 November 2026

ఘనంగా నామ జన్మదిన వేడుకలు.

 

 

 

 

– నామా ట్రస్ట్ సేవలు అభినందనీయం…

– నామా యూత్ అధ్యక్షులు బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు దుద్దుకూరి రాజా.

బూర్గుంపహాడ్ మార్చి 15 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం లో గత 17 సంవత్సారాలు గా నామా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న నామ యూత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి రాజా ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న హాజరై భారీ కేకును కట్ చేసి, స్వీట్స్ పంచి పెట్టారు, అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దుద్దుకురి రాజా మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు నామా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే ఆయన సేవలు పట్ల జిల్లా ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలు మరింత విస్తృతం చేయాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నామా నాగేశ్వరరావు ఆయురారోగ్యాలు తో సుఖ సంతోషాలతో ఉండి, ప్రజలకు మరింత సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, బోల్లు శ్రీను, బొందయ్య, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.