బై0సా. రూరల్ మార్చ్ 15జనం సాక్షి
రాష్ట్రంలో వరుస హార్ట్ఎటాక్ సంఘటనలు జరిగి పలువురు మృతి చెందిన సంఘటనలు రోజు వింటూనే ఉన్నాం. అయితే గుండె సంబంధిత కార్ఢీయట్రీక్ హరేస్ట్ వచ్చినప్పుడు సి.పి.ఆర్ చికిత్స అందించిడ0 వలన వ్యక్తిని మరణం నుండి తప్పించవచ్చని బైంసా పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ లో డాక్టర్స్ అసోసియేషన్ వైద్యులు శిక్షణ కార్యక్రమాన్ని పట్టణ రిపోర్టర్స్ కి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైంసా మండల ఎం.అర్.ఓ చంద్రశేఖర్ రెడ్డి. హాజరై మాట్లాడారు… ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయని,దానికి తగ్గ వ్యాయామాలు రోజు చేయాలని ముఖ్యంగా అందరికీ సి.పి.ఆర్ సిస్టంపై అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ దామోదర్ రెడ్డి, ముష్కం రామకృష్ణ గౌడ్, ముత్యంరెడ్డి, కైలాస్ పతి, సూర్యకాంత్, కుమార్ యాదవ్ పలువురు పట్టణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రిపోర్టర్స్ పాల్గొన్నారు.




