ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్15. ఈ రోజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు గ్రామపంచాయతీ ఆవరణలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సర్పంచ్ ఈసం రామ్మూర్తి ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఈసం రామ్మూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు ఏటూరు నాగారం గ్రామపంచాయతీ ఆవరణప్రాంగణమంతా తెలంగాణ సంస్కృతి ముగ్గులతో ముస్తాబు చేసి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది సేవలను గుర్తుచేసుకొని వారి యొక్క సేవా కార్యక్రమాలకు గాను పారిశుధ్య కార్మికులు అయినటువంటి 40 మంది కి శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలను మరియు బట్టలు అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ రామ్మూర్తి తో పాటు,ఉప సర్పంచ్ అరుణ, వార్డు సభ్యులు స్వరూప, అశ్విని,స్వప్న ,కనకతార ,నాగరాజు, రంజిత్ ,హనుమంతు, నాగ సాగర్ తో పాటు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్, బిఆర్ఎస్ ములుగు జిల్లా సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సిపిఎం జిల్లా నాయకులు ఎండి దావూద్,పంచాయతీ కార్యదర్శి అశోక్, ఎంపీఓ శ్రీకాంత్, ఏటూరు నాగారం తహసిల్దార్,డిప్యూటీ తాసిల్దార్ఆర్ ఐ ,ఇరిగేషన్ ఏఈ, మరియు అంగన్వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘనంగా పల్లె ప్రగతి కార్యక్రమం




