Thursday, 5 November 2026

పాలక మండలి ఉండగా నాకేంటి పని ?

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 బోయినపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో అసలేం జరుగుతుంది ? ఉన్నత శ్రేణి అధికారికి పాలక మండలికి విభేదాల ఏమన్నా ఉన్నాయా 2023 ఫిబ్రవరి 14వ తేదీన వ్యవసాయ శాఖ నుంచి నూతన పాలక మండలి కొలువు తీరుతుందని వెల్లడి ఫిబ్రవరి 16న పూర్తిస్థాయిలో పాలక సభ్యులు, వైస్ చైర్మన్, చైర్పర్సన్ అందరూ కలిసి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలు లా కనిపిస్తున్న పాలకమండల్ని ప్రతిచోట హేళన చేస్తూ నేనే బిగ్ బాస్ నేనే సుప్రీం నేను లేకపోతే మార్కెట్ లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్న సెక్రటరీ ఆయనకు యాడ్ సమస్యలు పట్టవు పట్టేదల్లా పట్టు బిగించి పిడకలు బిగించి నైజం అయింది అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది అంటే ఎక్కడ అంటే మీకు తెలుసా? ఉదాహరణకి గోకులంలో గోకుల ప్రజల్ని కాపాడేది శ్రీకృష్ణుడైతే, బోయిన్పల్లి మార్కెట్ సెక్రెటరీని నీ కాపాడేది ఎవరు అనుకుంటున్నారు
మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ? అటెండర్ నుంచి ఉన్నత స్థాయి వరకు తన వర్గానికి సంబంధించిన ఎవ్వరైనా ఎంత అవనీతి పడగలు ఇప్పిన నేనున్నానంటూ అభయమిస్తూ తోడూ నీడై కాపాడుతుంది మార్కెట్లో అస్సలు బోయినపల్లి మార్కెట్లో అన్ని సమస్యలకు ఉన్నత అధికారులే కారణం అంటున్నారు బోయినపల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్లు ఏ ధైర్యంతో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీకి ఉదాహరణ ఈరోజు ఉదయం పాలక సభ్యునికి సెక్రటరీకి జరిగిన సంభాషణ: సార్ నమస్కారం బిఎస్బిషాప్ నెంబర్ ఏ 9 బిట్ల సంజయ్ ని పాలకమండలి చైర్పర్సన్ రోడ్డుకి అడ్డదిడ్డంగా వాహనం పెట్టి వ్యాపారం నిర్వహిస్తుంది ఎవరు అంటూ ప్రశ్నించడంతో విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ ఆదేశాలు ఇచ్చారు.గత పది రోజుల క్రితం వరకు బానే ఉన్నా నిన్న పెద్ద లారీ తో టమోటా వాహనాన్ని అడ్డంగా నిలిపి వ్యాపారం నిర్వహించడం గమనించిన సదరు కమిషన్ ఏజెంట్ సెక్రెటరీ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన వివరణ ఈ విధంగా ఉంది పాలక సభ్యుడు సెక్రటరీకి ఫోన్ ద్వారా విషయం తెలియజేయడం తో ఉన్నారు కదా మీ పాలక మండలిలో హేమాహేమీలు చూసుకోండి అంటూ టాపిక్ ని క్లియర్ చేయండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మీరు చూసుకోండి అని ఫోన్ పెట్టేయటం పట్ల ఆయనకున్న యాడ్ పై నిబద్దత ఏంటో సంభాషణ తో తెలిసిపోతుంది. అసలు ఈ అధికారులను ప్రోత్సహిస్తున్నది ఎవరు ? తమ పని తాము చేసుకుంటున్న కమిషన్ ఏజెంట్లు ను వారి లోస్సుకులను బహిర్గతం చేస్తూ సెక్రటరీకి తొత్తుగా మారింది బోయినపల్లి కమిషన్ ఏజెంట్ లు అసోసియేషన్ అధ్యక్షుడు ? ఎంతోమంది సెక్రెటరీ చూసిన ఈ యాడ్ లో ఇలాంటి అధికారి ఆగడాలను మాత్రం గతంలో ఎన్నడూ చవిచూడలేదు. ఎస్ జి ఆర్ కి బేరగాళ్ళ సమస్యల పట్టవు కానీ ఆయన అన్నిటిలో ముందుంటాడు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో విజిలెన్స్ విభాగం ఉందా అంటే ప్రశ్నార్థకమే ? ఉత్సవ విగ్రహం లాంటి అధికారులు మార్కెట్లో సంచరిస్తుంటే అయిన మార్కెట్ బాధలు పట్టవు బోయిన్ పల్లి మార్కెట్లో ఇంత పెద్ద అవినీతి దందా జరుగుతున్న అధికారులు అస్మదియులు తో కలుస్తున్న విజిలెన్స్ అధికారులు ఏమి చేస్తున్నారు. అసలు విజిలెన్స్ అధికారులు గతంలో బోయినపల్లి మార్కెట్ ను తనిఖీ చేసిన దాఖలాలు ఉన్నాయా.ఇన్ని సమస్యలతో కూడిన ఇబ్బందులు ఎదురవుతున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ స్పందించిని దాఖలాలు లేవు మర్యాదపూర్వకంగా నూతనంగా కొలువుదీరిన పాలకమండలి సంబంధిత వ్యవసాయ శాఖ మార్కెటింగ్ సంచాలకులను కలిసిన చైర్ పర్సన్. బోయిన్పల్లి మార్కెట్లో మౌలిక సమస్యలు, అధికారులు విధి విధానాలపై చర్చిస్తున్న సందర్భంలో ఇవన్నీ సర్వసాధారణమే కొట్టు పారేసిన డైరెక్టర్ సంచాలకులు, వ్యవసాయ శాఖలో యథా రాజా తాజా ప్రజా అనే చందనంగా దాపరిచింది పరిస్థితి.
అలాగే విజిలెన్స్ అధికారులు నిద్రవస్థలో ఉన్నారని అనుకోవచ్చా ? ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులు స్పందించకపోతేమీ శాఖకి తెగుళ్లు పడుతున్నాయి. ఆశాఖకు ఉన్న కీర్తి ప్రతిష్టలను దిగజారిస్తున్న శేడపురుగులపై చర్యలు తీసుకోవాలని బోయినపల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సర్కార్ ప్రతినిధిగా గౌరవనీయులైన మార్కెట్ యార్డ్ కి చైర్ పర్సన్ గా నియమితులైన కమిటీ పైన వ్యంగ్యంగా మాట్లాడటం సెక్రటరీకి తగునా,ప్రతి సందర్భంలో ఆధారాలు, నిజాo గా ఉన్నాయా అంటూ ప్రశ్నించే సెక్రటరీకి నిన్న పాలక మండల సభ్యులకి సెక్రెటరీ జరిగిన సంభాషణ ఓ ఆధారం అంతకుమించి మరి ఏమి ఉండదు.