శివ్వంపేట జూలై 3 జనంసాక్షి : గురు పూర్ణిమ వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన భగలాముఖీ శక్తి ఫిఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగలాముఖి అమ్మవారి ఉపాసకులు ట్రస్ట్ చైర్మన్ శాస్త్రల వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేద పండితులు భగలాముఖి అమ్మవారికి మహాపూజ అభిషేకం, అర్చన, మహా మంత్ర హవనం చేపట్టారు. గురు పూర్ణిమ సందర్భంగా భగలాముఖి మాత ప్రధాన పీఠాన్ని అనుకొని నిర్మించిన ధ్యాన మందిరంలో వ్యాస మహర్షి, దక్షిణామూర్తి, ఆది శంకర భగవత్పాదులు మూలమూర్తుల గురుత్రాయానికి రుద్ర నమక చమకాలతో కూడిన మంత్రాలను పటిస్తూ, కలశంలో నింపిన జలాలతో స్వామివార్ల మూలమూర్తులను అభిషేకించారు. ఆ తర్వాత విశేష పూజలు, హవనం, అర్చనలు చేసి మహా పూర్ణాహుతితో పూజలను ముగించారు. అదేవిధంగా కామారెడ్డి చెందిన భగలాముఖి మాత భక్తుడు భార్గవి శ్రీనివాస్ దంపతులు శక్తి పీఠంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకుగాను 51 వేల రూపాయలు విరాళం సమర్పించారు. ఇకపై ప్రతి పౌర్ణమకు జిన్నారం పెద్దగౌని లింగయ్య అతని ధర్మపత్ని అయిన అంజమ్మ దంపతుల జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు, బగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివ కుమార్ గౌడ్ రమాదేవి దంపతులు అన్నదానం కార్యక్రమాన్ని చేపడతామని భక్తుల సమక్షంలో స్పష్టం చేసీ మొదటి విడత అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించి పలువురి భక్తులకు స్వయంగా వడ్డించారు. అంతకుముందు గురు పూర్ణిమ సందర్భంగా శాస్త్రుల వెంకటేశ్వర శర్మకు ఆయన శిష్యుల బృందం గురుపూజ నిర్వహించి, శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భగలాముఖి మాత ట్రస్ట్ సభ్యులు అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, ట్రస్ట్ సభ్యులు జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా, జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్, పత్రాల శ్రీనివాస్ గౌడ్, శాస్త్రుల పురుషోత్తమ శర్మ, మారుమూల వెంకటరమణ శర్మ, పూజారి సంతోష్ శర్మ, ఆనంద్ పండిట్, పట్లోళ్ల రమాదేవి తిరుపతిరెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ రాజీపేట పద్మా వెంకటేష్, ఉప్పల గోవిందరాజు గుప్తా, తాటిపల్లి శ్యాంసుందర్ గుప్తా, వరగంటి రమేష్ గుప్తా, మొగుడంపల్లి భాస్కర్ గుప్తా, సూర్య కుమార్ గౌడ్ వందరి కొండల్, బాసంపల్లి పోచ గౌడ్, పంబాల సంతు ముయ్యాడి సింహం లతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా పూర్ణిమ వేడుకలు పూర్ణాహుతి తో ముగిసిన పూజలు




