ఏటూరునాగారం(జనంసాక్షి)జులై 03.ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ ద్వారా అవసరం ఉన్నవారికి రక్తదానం మరియు ఆపదలో ఉన్న వారికి దాతలు ద్వారా ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు. దీనిని రిజిస్ట్రేషన్ చేయించాలి అని గ్రూప్ లో జరిగిన చర్చ ను చూసి వెంటనేనర్సింహసాగర్ కు చెందిన శ్యమకురి శ్రీనివాస్- అరుణ గౌడ్ దంపతులు ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ కు 9000/- అందించి రిజిస్ట్రేషన్ చేయించామని చెప్పారు. అలాగే అడ్మిన్ గా కొనసాగుతున్న వారికి 1 సంవత్సరం కు కావాల్సిన రీఛార్జ్ కూడా చేస్తా అన్నారు. ఎలాంటి ఆర్ధిక సహాయం అందించాటానికి సిద్ధం గా ఉన్న అన్నారు. ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సేవలు అమూల్యo అని ఇలాంటి కార్యక్రమం లు చేస్తున్న వారికి దేవుడు ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి అని అన్నారు. ఈ సందర్బంగా ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సభ్యులు శ్రీనివాస్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు..
మానవత్వం చాటుకున్న శ్యామకూరి శ్రీనివాస్- అరుణ గౌడ్ దంపతులు రిజిస్ట్రేషన్ చేయించమని 9000/- ఆర్థిక సహాయం




