ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి.
ఫొటో : నివాళులు అర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘ నాయకులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని గాంధీ చౌక్ లో గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జీఎం ఆఫీస్ క్రాస్ రోడ్, గాంధీ చౌక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల కోసం ఒకే రాష్ట్రం ఉండాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాత భాస్కర్, విద్యా సాగర్, బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్, నరేందుల వేణుగోపాల్, కాసనగొట్టు శశిధర్, బాల సంతోష్, గోగు శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు.
ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి.




