ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి
జూలూరుపాడు, డిసెంబర్ 15, జనంసాక్షి: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని మండల ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పెండ్యాల ప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడులోని గ్రంథాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుజాతి అభ్యున్నతి కోసం ఆయన చేసిన అవిరళ కృషిని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి తొండెపు సుబ్బారావు, కోశాధికారి భానుప్రకాష్, టౌన్ ప్రెసిడెంట్ ఉడుత పూర్ణచంద్రరావు, వేముల గురునాథం పాల్గొన్నారు.




