Tuesday, 3 November 2026

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బిచ్కుంద ఏప్రిల్ 05 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం నాడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి డాక్టర్ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాన్సాబ్, సంధి సాయిరాం పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో నగేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.