బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంజిల్లా ఓబీసీ అధ్యక్షుడు మురళి బిచ్కుంద 05 ఏప్రిల్ (జనంసాక్షి ) పల్లె పల్లెకు ఓబీసీ ఇంటి ఇంటికి బీజేపీ వాల్ పోస్టర్ ను బిచ్కుంద మండలకేంద్రంలో కామారెడ్డి జిల్లా భాజాపా ఒబిసి అధ్యక్షుడు మహారాజుల మురళి మరియు జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తార ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతు బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. ఓబిసిల అభివృద్ధి కేవలం బిజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకోదగ్గ నేత మన ప్రధాని మోడీ అని కొనియాడారు. మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పల్లె పల్లెకు ఓబీసీ ఇంటి ఇంటికి బి జె పి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని, ఓబీసీల కోసం మోడీ చేస్తున్న ప్రతి పనులను ఇంటి ఇంటికి తెలిసేలా జిల్లాలో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల అధ్యక్షుడు గోపాల్ చారి, శ్రీధర్ పంతులు, పిట్లం మండల అధ్యక్షుడు నాగరాజు, గంగాధర్, డోంగ్లి మండల అధ్యక్షుడు గంగాధర్, ఎల్లారెడ్డి బీజేపీ నాయకులు పోతుగంటి సాయిలు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం




