ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
టేకులపల్లి, ఏప్రిల్ 5 (జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ ఎస్ కే అంజాద్ పాష ఆధ్వర్యంలో స్థానిక సిబ్బంది బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రత్తయ్య, యూ డి సి కాంతయ్య, మండల పరిషత్ అధ్యక్షురాలు భూక్య రాధా, సర్పంచ్ బానోతు విజయ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి




